పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బీటీ రోడ్డు నిర్మించాలని వినతి

పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బీటీ రోడ్డు నిర్మించాలని వినతి

ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట నుంచి డుంబ్రిగూడ మండలం చాపరాయి వరకు 40km బీటీ రోడ్డు నిర్మించాలని ఐదు పంచాయతీల ప్రజలు కోరారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ అరకు ఇంఛార్జ్ దొన్నుదొర అరకులోయలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతి ఇచ్చారు. ఈ రోడ్డుతో పర్యాటక ప్రాంతాలైన సుంకరిమెట్ట వ్యూ పాయింట్, వుడెన్ బ్రిడ్జి, మడగడ సన్ రైజ్ పాయింట్, చాపరాయి జలపాతాలను కలపవచ్చన్నారు.