ఎం.కే పట్నంలో నాలుగు వరి కుప్పలు ధ్వంసం
AKP: రోలుగుంట(మం) మొఖాస కొత్తపట్నంలో నాలుగు వరి కుప్పలు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 160 వరి బస్తాలు వస్తాయని తెలిపారు. రూ.1 లక్షల ఆస్తి నష్టం వచ్చిందని తెలిపారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.