అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేసిన నేతలు
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపాన్ని ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ నేతలు పాలతో శుద్ధి చేశారు. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే BRS నేతలు నిరసన చేయడంతో స్థలం అపవిత్రం అయిందని పాలతో శుద్ధి చేశామని తెలిపారు.