పందేలకు సిద్ధమవుతున్న కోడి పుంజులు
GNTR: సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు బరిలోకి దిగుతున్నారు. పందేల కోసం రూ. లక్షలు ఖర్చు చేసి వివిధ రకాల పుంజులను సిద్ధం చేస్తున్నారు. రోజూ బలమైన ఆహారం, వ్యాయామంతో ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఒక్కో పుంజుకు రోజుకు రూ.700–1000 వరకు ఖర్చు చేస్తున్నారు. మటన్, డ్రైఫ్రూట్స్ వంటి ఆహారం ఇవ్వడంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది.