దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయూ
ATP: పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె కరపత్రాలు, బుక్లేట్లు రైల్వే కార్మికుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. సీఐటీయూ పట్టణ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్లను రద్దు చేయాలనీ, పలు కార్మికుల సమస్యలపై జరిగే సమ్మెను జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.