రావెలలో 'రైతన్న-మీకోసం'

రావెలలో 'రైతన్న-మీకోసం'

GNTR: తాడికొండ మండలం రావెలలో బుధవారం 'రైతన్న-మీకోసం' కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 'అన్నదాత-సుఖీభవ' కింద ఏటా రూ.20 వేలు జమ చేస్తోందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, తద్వారా అధిక దిగుబడి, ఆదాయం పొందవచ్చని సూచించారు. అనంతరం రైతులకు విత్తనాలు అందజేశారు.