ముగిసిన ధనుర్మాస పూజలు

ముగిసిన ధనుర్మాస పూజలు

CTR: పుంగనూరు మేలుపట్లలోని శ్రీకోదండ రామాలయంలో ధనుర్మాస పూజలు శనివారంతో ముగిశాయి. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారికి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ధనుర్మాసంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు పెద్దలు తెలిపారు.