ఉల్లి రాశి దగ్ధం.. ఎస్సై పరిశీలన
NRPT: ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లిలో దుండగులు ఉల్లి రాశికి నిప్పంటించిన ఘటనపై ఎస్సై రమేశ్ విచారణ చేపట్టారు. రైతు మహదేవప్ప పొలంలో ఆరబోసిన ఉల్లిగడ్డలపై తాటి కమ్మలు కప్పి ఉంచగా, అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో పంట పూర్తిగా కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.