VIDEO: దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ

VIDEO: దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ

WGL: రాయపర్తి మండలం మొరిపిరాల దుర్గమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ముఖానికి టవల్ చుట్టుకుని గుడిలోకి ప్రవేశించి, సీసీ కెమెరా వైర్లు కట్ చేసి 50 తులాల వెండి ఆభరణాలు, 6 గ్రాముల బంగారంతో పాటు హుండీలో నగదును అపహరించాడు. ఈ ఘటనపై గ్రామస్తులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై రాజేందర్ విచారణ చేపట్టారు.