ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
KDP: మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డపైన ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.