ఈనెల 24న పెంటపాడులో జాబ్ మేళా
W.G. పెంటపాడు డీఆర్ గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 9:30 నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో 10 నుంచి డిగ్రీ, ఐటీఐ, కెమిస్ట్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.