హుజూర్నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన

హుజూర్నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన

SRPT: హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2,160 ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇవ్వాళ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కమిటీ అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. కేవలం 805 మందితో కూడిన అసంపూర్ణ జాబితాను విడుదల చేయడం సరికాదని, అందులోనూ అనర్హులకే చోటు దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.