గంగవరంలో ఉరివేసుకుని వృద్ధుడు మృతి

CTR: గంగవరం మండలం కొత్తూరుకు చెందిన ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన సమాచారం మేరకు.. గ్రామనికి చెందిన ఎర్రప్ప (70) గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.