'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
ATP: తాడిపత్రి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి నవరంగ్ టాకీస్ రోడ్డు వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. పట్టణ పరిశుభ్రతను పరిశీలించి స్థానిక ప్రజలు, షాపు యజమానులతో మాట్లాడారు. చెత్తను రోడ్లపై వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.