విధుల్లో ఆలసత్యం వహిస్తే చర్యలు: DEO

విధుల్లో ఆలసత్యం వహిస్తే చర్యలు: DEO

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, హాజరును ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో నమోదు చేయాలని డీఈఓ సూచించారు.