సాగర్ అందాలను తిలకించిన మంత్రి

సాగర్ అందాలను తిలకించిన మంత్రి

PLD: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. గత కొన్ని రోజులుగా క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం మాచర్ల పర్యటనలో ఉన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి ఈ సుందర దృశ్యాన్ని తిలకించారు.