పడిపోయిన టమాటా ధర.. అప్పుల్లో రైతులు

NLG: టమాటా ధర అమాంతం పడిపోవడంతో అప్పుల పాలవుతున్నామని కనగల్ మండలం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర 20 నుంచి 30 రూపాయల వరకు పలికింది. ఇప్పుడు KG రూ.10 నుంచి 20కి పడిపోయింది. దళారులు రైతులకు KG 3 మించి ఇవ్వకపోవడంతో కూలీలు రవాణా ఖర్చులకు ఏం మిగలట్లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.