జనాభా గణనపై శిక్షణా తరగతులు

జనాభా గణనపై శిక్షణా తరగతులు

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఈనెల 23 నుంచి 29 వరకు మొదటి దశ జనాభా గణనపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు డీఆర్వో మాలోల తెలిపారు. ఎంపిక చేసిన 82 మంది క్షేత్రస్థాయి శిక్షకులకు మూడు బ్యాచ్‌లుగా అవగాహన కల్పిస్తామన్నారు. ఇళ్ల జాబితా, గణన ప్రక్రియను హెచ్.ఎల్.వో యాప్‌లో నమోదు చేసే విధానాన్ని నిష్ణాతులు వివరిస్తారని చెప్పారు.