నగరంలో వాటర్ ట్యాంకర్ల దందా
HYDలో నీటి సరఫరాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జలమండలి సిబ్బంది వాల్వ్‌లు బంద్ చేసి కృత్రిమ కొరత సృష్టించి, ప్రైవేట్ ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. యాప్ ద్వారా బుకింగ్ చేస్తే సర్వర్ డౌన్ చూపిస్తూ, దళారులకు రూ. 2,500 చెల్లిస్తే అరగంటలో ట్యాంకర్ అందిస్తున్నట్లు సమాచారం. దాదాపు నెలకు రూ. 3 కోట్ల వరకు చీకటి వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తోంది.