ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
NLG: చందంపేట మండలం చిత్రియాలలో సహకార సంఘం బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పీఏసీఎస్ ఛైర్మన్ నరసింహారెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంట రైతులకు ఆర్థికంగా లాభదాయకమని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలన్నారు.