ఆర్డీవో కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు భద్రపరిచిన గదులను పరిశీలించి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.