బెంగాల్‌లో ఈసీ భారీ ప్రక్షాళన
బెంగాల్‌లో ఈసీ రాష్ట్ర పరిపాలన, పోలీస్ శాఖల్లో భారీ మార్పులు చేసింది. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా దుశ్యంత్, హోంశాఖ కార్యదర్శిగా సంఘమిత్ర ఘోష్‌ను నియమించిన ఈసీ.. తాజాగా కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తో పాటు పలు విభాగాల డీజీలను బదిలీ చేసింది. కొత్త అధికారులు ఇవాళ బాధ్యతలను స్వీకరిస్తారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.