సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు
MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దర్శించుకున్నారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి సీతక్క పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు.