మహిళా భద్రతపై విద్యార్థినులకు అవగాహన
KNR: గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పోలీసుల ఆధ్వర్యంలో మహిళా భద్రత, సమాజంలో షీటీం పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. మహిళలపై జరిగే నేరాలపై మహిళా కానిస్టేబుళ్లతో పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు అత్యవసర సమయంలో షీటీంను సంప్రదించవచ్చని తెలిపారు.