పూర్వ విద్యార్థుల సేవా హస్తం
BDK: పాల్వంచ బొల్లెరుగూడెం జెడ్పీ హై స్కూల్ 2000 –2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మానవతా ధృక్పథంతో ముందుకు సాగుతున్నారు. తమ మిత్రుడు కోమ్మజి నరేంద్రబాబు అకాల మరణంపై సానుభూతి తెలుపుతూ, దశదినానికి రూ. 28 వేలను కుటుంబానికి వారు అందించారు. ఇదే బ్యాచ్ గతంలో వారి మిత్రుడు కాల్వ రాజశేఖర్ కుటుంబానికి రూ. 25 వేల సహాయం చేసింది.