ఎమ్మెల్యే గోరంట్ల దృష్టికి చేనేత కార్మికుల సమస్యలు

E.G: కడియం మండలంలోని మురమండ, వీరవరం, దుళ్ళ , పొట్టిలంక, గ్రామాలకు చెందిన చేనేత నాయకులు ఆదివారం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందిస్తూ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో సమస్య పరిష్కారం అయ్యేలా మాట్లాడతానని హామీ ఇచ్చారు.