కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి భేటీ
E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించి ఆమోదించాలని కోరారు. అలాగే కొత్త పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రస్తావించారు.