కలెక్టర్‌ను వెంటబెట్టుకుని సీఎంను కలిసిన పవన్ కళ్యాణ్

కలెక్టర్‌ను వెంటబెట్టుకుని సీఎంను కలిసిన పవన్ కళ్యాణ్

KKD: కలెక్టర్‌ల సదస్సు ముగిసినానంతరం DY.CM పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ షన్మోహన్‌తో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పవన్ ఆప్యాయంగా చేతితో పట్టుకుని సీఎం వద్దకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని అధికారవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.