'నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు'
E.G: దేవాదాయ ధర్మాదాయ స్థలాల్లో ఎవరైనా ఆయా ధార్మిక సంస్థల ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాజమండ్రిలో గౌతమి జీవ కారుణ్య సంఘం స్థలంలో కల్లు విక్రయాలు చేయడంతో ఆయన స్పందించారు. కల్లు విక్రయాలు నిలిపివేయాలన్నారు.