ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్
KRNL: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో VC ద్వారా ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, RIOలు పాల్గొన్నారు.