VIDEO: 'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

E G: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నందున్న కొవ్వూరు మండలంలోని లంక వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దూరు లంకలో ఆయన పర్యటించారు. ఏటా వరదల కారణంగా మద్దూరు లంక నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.