ఆదోని మున్సిపాలిటీ LRS ఆదాయం ఎంతంటే..?

ఆదోని మున్సిపాలిటీ LRS ఆదాయం ఎంతంటే..?

KRNL: ఆదోని మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.1.80 కోట్ల ఆదాయం సమకూరిందని ఇవాళ కమిషనర్ నయీమ్ అహ్మద్ తెలిపారు. మొత్తం 302 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 138 మంజూరయ్యాయని పేర్కొన్నారు. మిగిలినవి ఆమోదం పొందితే మరో రూ.2 కోట్లు వచ్చే అవకాశముందని వివరించారు. అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లను ఫీజు చెల్లించి చట్టబద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.