20కి చేరిన మృతుల సంఖ్య

20కి చేరిన మృతుల సంఖ్య

ఇండినేషియా జకార్తాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్లు తయారు చేసే కార్యాలయంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు సమీపంలోని భవనాలకు వ్యాపించడంతో అక్కడి ప్రజలు అధికారులు ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారు.