గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

CTR: గంగాధర నెల్లూరు మండలం ముక్కలత్తూరు గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో సతీశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులకు సరిగా హాజరవుతున్నారా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారంతో కూడిన పోస్టర్లను ఆయన పరిశీలించారు.