'రానున్న MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తాం'
KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్పించాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.