కొండాపురం రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత
ATP: పామిడి నుంచి కొండాపురం వెళ్లే మార్గంలోని రైల్వే గేటు (ఎల్సీ నం.145) నాలుగు రోజుల పాటు మూసివేయనున్నట్లు కల్లూరు సెక్షన్ ఇంజినీరు గడ్డం రవిబాబు తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 వరకు మరమ్మతుల కారణంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 4 రోజుల తర్వాత యథాతథంగా వాహనాల రాకపోకలు సాగుతాయన్నారు.