దొంగతనం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

దొంగతనం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్ దొంగతనం కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన బంగారు గొలుసు, 5 ఉంగరాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. విచారణలో భాగంగా బాలకృష్ణ, నీలేశ్, తిరుపతిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన 11 గ్రా.గొలుసు, 5 ఉంగరాలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.