VIDEO: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
NZB: ధర్పల్లి మండలం హొన్నజిపేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం బుధవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ. 2,389, బీ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ. 2,369 ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశవ్వ బాబన్న పాల్గొన్నారు.