‘కేంద్రానికి దేశం మొత్తం మద్దతు ఇస్తోంది’

‘కేంద్రానికి దేశం మొత్తం మద్దతు ఇస్తోంది’

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. 'భారత సాయుధ దళాలు తగిన సమాధానం ఇవ్వడానికి పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. మన సైనికులు, సైన్యం, వైమానిక దళం, నావికాదళం సిద్ధంగా ఉన్నాయని యావత్ భారత్ నమ్ముతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు దేశం మొత్తం మద్దతు ఇస్తుంది. కేంద్రానికి మద్దతుగానే ఈ తిరంగా యాత్రను నిర్వహించాం' అని తెలిపారు.