ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

BHPL: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు బుధవారం నిరసన చేపట్టారు. మాజీ MLA గండ్ర ఈ నిరసనలు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు.