హుస్సేన్ సాగర్‌లో ఫ్లోటింగ్ గ్రౌండ్

HYD: నీటిపై తేలియాడే మైదానాన్ని మన భాగ్యనగరంలోనూ ఏర్పాటు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంజీవయ్య పార్కులో సాగర్‌కు ఆనుకొని నీటిపై ఫ్లోటింగ్ బాక్సు క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు వల్ల పర్యాటకులను ఆకట్టుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మన వద్ద క్రికెట్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేయనున్నారు.