మద్దికుంటలో భారీ చోరీ.. బంగారం మాయం..!

మద్దికుంటలో భారీ చోరీ.. బంగారం మాయం..!

KMR: రామారెడ్డిలోని మద్దికుంట గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు.శుక్రవారం ఓరుగంటి రాజు అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం,15 తులాల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.