VIDEO: మీరు పెట్టిన పాలసీలను కూడా పట్టించుకోరా..?: హరీష్
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పవర్ పాలసీ ప్రవేశపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ పాలసీ అని అసెంబ్లీలో పెట్టి, మళ్లీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని చెబుతున్నారని ఆరోపించారు. మీరు పెట్టిన పాలసీలను కూడా మీరు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.