జల మహోత్సవం ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌లతో కలిసి జల మహోత్సవం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని డైనేజీలు, రోడ్ల శుభ్రతలో గ్రామపంచాయితీ సిబ్బందితో కలిసి కాసేపు పనిచేశారు. అనంతరం మంత్రి సీతక్క గ్రామపంచాయితీ కార్మికులను సన్మానించారు.