ఇరుకు వంతెనతో తప్పని ఇక్కట్లు..!
సిద్దిపేట: జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలో గల ఇరుకైన వంతెనతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వంతెన మీదుగా సూర్యాపేట జనగామ హైదరాబాదుకు రోజు వందలాది వాహనాలు వెళ్తాయి. వంతెన ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.