'ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి రద్దు'

'ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి రద్దు'

WNP: గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు మెంబర్ ఎన్నికలు పూర్తయి, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.