ఎన్టీయూ కర్నూలు నూతన కార్యవర్గం ఎన్నిక
KRNL: కర్నూలు ఎన్టీయూ (STU) భవనంలో ఉపాధ్యాయ నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఉత్కంఠగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా జనార్దన్, కార్యదర్శిగా చిన్న సుంకన్న, ఆర్థిక కార్యదర్శిగా శ్రీధర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నూతన నాయకులు డిమాండ్ చేశారు.