గురుకుల అధ్యాపకుడు రాజుకు డాక్టరేట్

BHNG: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల - రాజాపేట అధ్యాపకుడు బామండ్ల రాజు OU డాక్టరేట్‌కు ఎంపికయ్యాడు. OUలో నీల జంగయ్య కవిత్వం సమగ్ర అంశంపైన వెలుదండ నిత్యానందరావు పర్యవేక్షణలో ఆయన చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఈ నెల 19న OUలో జరగనున్న 84వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్నాడు.