ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్
SRD: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ జెడ్పీ హైస్కూల్ HM జయశ్రీని విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ ప్రావీణ్య సస్పెండ్ చేశారు. విధులకు గైర్హాజరు కావడంతో పాటు, FEBలో పని చేయని ఓ విద్యా వాలంటీర్‌కు జీతం వచ్చేలా అటెండెన్స్ సర్టిఫికేట్ జారీ చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ డీఈఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.