VIDEO: ఇడ్లూరులో శిల్పకళా వైభవం
NRPT: కర్ణాటక సరిహద్దు ఇడ్లూరులోని శంకర్ లింగేశ్వర స్వామి ఆలయం ప్రాచీన శిల్పకళకు నిలయంగా నిలుస్తోంది. ఇక్కడి స్వయంభూ శివలింగం, ముఖ మండపంలోని అద్భుత స్తంభాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ శైవక్షేత్రం స్థానిక సంస్కృతి, భక్తి పరంపరలకు ప్రతీకగా నిలుస్తూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రాచీన నిర్మాణ శైలి ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.